![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -164 లో..... శైలు, చక్రి ఫోన్ మాట్లాడుకుంటుంటే అప్పుడే కన్నా, మహా వచ్చి చాటుగా వింటారు. రేయ్ ముంగీస మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని శైలు అడుగుతుంది. ఇప్పుడే పెళ్లి ఎందుకని కేశవ అంటాడు. త్వరగా పెళ్లి చేసుకొని ఒక పదిమంది పిల్లలు కందామని శైలు అనగానే పది మంది పిల్లలా అని కేశవ ఆశ్చర్యంగా అంటాడు. అది విని మహా కన్నా నవ్వుకుంటారు. ఓరి మీ దుంపలు తెగ ఇండియాకి క్రికెట్ టీం ఇచ్చేలా ఉన్నారు కదరా అని కన్నా అంటాడు.
ఆ తర్వాత శైలు ఫోన్ మాట్లాడడం వాళ్ళ అన్న సురేష్ వింటాడు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని తనతో గొడవ పడుతాడు. నీ కూతురు వాడితో పిల్లల వరకు వెళ్ళిందని సురేష్ వాళ్ళ అమ్మనాన్నతో చెప్తాడు. దాంతో శైలుపై వాళ్ళ అమ్మ వరాలు కోప్పడుతుంది. మరొకవైపు మహాని డ్రైవింగ్ టెస్ట్ కోసం చక్రిని తీసుకొని వెళ్తుంది. వాళ్ళతో ఓంకారేశ్వర్ కూడా ఉంటాడు. అక్కడ టెస్ట్ చేసి లైసెన్స్ ఇచ్చేది ఎవరో కాదు ముందు రోజు మహా ఆక్సిడెంట్ చేసిన అతను.. అతన్ని చూసి నాకు లైసెన్స్ ఇవ్వడని మహా ఫిక్స్ అవుతుంది. దాంతో మహాకి చక్రి హెల్మెట్ ఇచ్చి ఇది మొహం కన్పించకుండా కవర్ చేసుకోమని పంపిస్తాడు కానీ అక్కడ హెల్మెట్ తియ్యమని అతను చెప్తాడు. మహా హెల్మెట్ తీయగానే మహాని చూసిన అతను నీకు డ్రైవింగ్ రాదని అంటాడు. ప్లీజ్ సర్ ఆ అమ్మాయి చాలా పూర్ .. నేనే జాలితో స్కూటీ కొనించానని చక్రి ఏదో ఒకటి కవర్ చేస్తాడు. దాంతో అతను ఒప్పుకొని మహాకి డ్రైవింగ్ టెస్ట్ పెడతాడు. అందులో మహా పాస్ అవుతుంది. లైసెన్స్ వస్తుందని అతను చెప్తాడు.
ఆ తర్వాత శైలుకి పెళ్లి చెయ్యాలని ఇంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒకతనికి చెప్తాడు. ఆ విషయం శైలుకి తెలిసి నేను కేశవని తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్తుంది. అయినా వాళ్ళు వినరు.. దాంతో శైలు గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. మరొకవైపు మహాకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలని నారాయణ పూజ చేస్తాడు. ఆ తర్వాత మహా వాళ్ళు ఇంటికి వస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని మహా చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |